వైకాపా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొనే ప్రభుత్వం కాదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.... అధికారంలో ఉన్నప్పుడు పోలవరంపై మాట్లాడని తెదేపా నేతలు..ఇవాళ వైకాపా ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే ప్రతి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంతో ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు.
పోలవరంపై నాడు తెదేపా ఎందుకు ప్రశ్నించలేదు?: సభాపతి తమ్మినేని - సభాపతి తమ్మినేని సీతారాం
పోలవరం ప్రాజెక్టు విషయంలో తెదేపా నేతలు వైకాపా ప్రభుత్వపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. నాడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ... పోలవరంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
ap speaker tammineni sitaram