చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మరణించాడు. జమ్మయ్య చెరువులో రమణ మృతదేహం లభించింది. మృతుృడి శరీరంపై, ముఖంపై గాయాలు కాగా.. చేతులు రెండు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.