ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన వీఆర్వో - vro

శ్రీకాకుళం జిల్లా నెరడి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఏసీబీ

By

Published : Sep 17, 2019, 9:45 PM IST

అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన వీఆర్వో

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నెరడి వీఆర్వో సుందరరావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ సోమవారం ఆడంగల్, ఈ పాస్ పుస్తకం కావాలంటూ వీఆర్వోను సంప్రదించింది. అందుకు10వేల రూపాయల లంచం అడిగాడు. మంగళవారం అధికారులు పథకం ప్రకారం నగదు తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details