శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం భగీరధపురం వీఆర్వో పొట్నూరు ధర్మపురి ఓ రైతు నుంచి బడివానిపేట సచివాలయంలో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఓ.ఏ.అగ్రహారం గ్రామానికి చెందిన జి.భాస్కరరావు అనే రైతు.. తమ భూమిని పట్టాదారు పాసు పుస్తకాల్లో మ్యుటేషన్ చేసుకునేందుకు గత నెలలో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత ప్రక్రియ కోసం దస్త్రాలను వీఆర్వో పొట్నూరు ధర్మపురి వద్దకు తీసుకువెళ్లగా... ఆయన డబ్బులు డిమాండ్ చేశారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో - భగీరధపురం వీఆర్వో వార్తలు
లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా భగీరధపురం వీఆర్వో... అనిశాకు చిక్కాడు. రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని విశాఖ జిల్లా అనిశా ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో
వీఆర్వో చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో బాధితుడు.. అనిశా అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం వీఆర్వో ధర్మపురి.. రైతు నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని... నిందితుడిని విశాఖ జిల్లా అనిశా ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి