ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

శ్రీకాకుళం జిల్లా గోనెపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆ అధికారిపై వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ దాడులు చేపట్టింది. నిందితుడిని దర్యాప్తు తరువాత విశాఖ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.

By

Published : Jan 27, 2021, 5:08 PM IST

Published : Jan 27, 2021, 5:08 PM IST

acb officials caught panchayat secretary in srikakulam district
ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం. సతీష్ బాబు ఏసీబీ వలలో చిక్కాడు. పంచాయతీ కార్యదర్శి పై గోనెపాడు గ్రామానికి చెందిన ఎం. తిరుపతి రావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారిని వలపన్ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బీవీఎస్​ఎస్​. రమణమూర్తి తెలిపారు.

గోనెపాడు గ్రామంలో పాఠశాల ప్రహరీని ఉపాధి హామీ పనులతో నిర్మించారు. నిర్మాణానికి అయ్యే మొత్తం రూ.77,637 లకు చెక్కు మంజూరు చేయడానికి.. ఆ అధికారి బాధితుడి నుంచి రూ. 6,000 లు లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న డబ్బు, సంబంధిత రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. దర్యాప్తు తరువాత నిందితుడిని విశాఖ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details