ప్రతి పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి అవుతున్న పరిస్థితుల్లో.. ఆ కార్డు పొందేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ప్రభుత్వం 2 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్ర బ్యాంకు, వికాస్ గ్రామీణ బ్యాంకు కార్యాలయాల దగ్గర ఉన్న ఈ కేంద్రాలకు... వందల సంఖ్యలో ప్రజలు కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావటంతో కేంద్రాలకు రద్దీ పెరిగింది. తరచూ అంతర్జాల సమస్య కారణంగా సేవలు నిలిచిపోతూ... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అధార్ నమోదు కేంద్రాలను పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఆధార్ కోసం తప్పని తిప్పలు.. గంటలపాటు నిరీక్షణ - palakonda
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆధార్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు నమోదు కేంద్రానికి తరలివెళ్తున్నారు.
ఆధార్