శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని గాంధీనగర్, శ్రీరామ్‌నగర్ ప్రాంత వాసులు స్థానికంగా ఉండే పారిశుద్ధ్య వాసు దంపతులను ఘనంగా సన్మానించారు. కరోనా కాలంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. రాజాం సీఐ సోమశేఖర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారికి దుస్తులు, నిత్యావసరాలు అందజేశారు. అలాగే సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణంనాయుడులను కాలనీ వాసులు సన్మానించారు.
పారిశుద్ధ్య కార్మిక దంపతులకు ఘన సన్మానం - tribute to police and sanitization workers
కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు కొన్నిచోట్ల ప్రజలు సన్మానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పారిశుద్ధ్య దంపతులను సీఐ ఆధ్వర్యంలో స్థానికులు ఘనంగా సన్మానించారు.
పారిశుద్ధ్య కార్మిక దంపతులకు ఘన సన్మానం