ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎస్​ రద్దు కోరుతూ.. యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉద్యోగుల 5కే వాక్​ - శ్రీకాకుళం వార్తలు

UTF Leaders : సీపీఎస్​ రద్దు చేయాలని యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు 5కే వాక్​ను నిర్వహించారు. నెల్లూరు, శ్రీకాకుళంలో నగరాలలో నిర్వహించిన ఈ వాక్​లో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

UTF
సీపీఎస్​ రద్దు

By

Published : Dec 18, 2022, 4:44 PM IST

UTF : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నెల్లూరు, శ్రీకాకుళంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 5కే వాక్​ను నిర్వహించారు. నెల్లూరు స్థానిక ఎన్జీవో హోం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉపాధ్యాయులు 5కే వాక్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న.. సీఎం జగన్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. సీపీఎస్ అమలుపై పోరాటాలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.

సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5కే వాక్

ABOUT THE AUTHOR

...view details