YSRCP leaders attack on Youtubrer: ప్రభుత్వ భూములు కబ్జా చేయడంతోపాటు మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కథనాలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్న వ్యక్తిని అధికార పార్టీకి చెందిన నేతలు చితకబాదారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన జియావుల్లా తీవ్రంగా గాయపడ్డారు. గాండ్లపెంట మండలం పరిసరాల్లో ఎర్రమట్టి అక్రమ రవాణాపై గనులశాఖ అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడికి వెళ్లిన జియావుల్లాపై వైకాపా నాయకులు దాడి చేశారు. పొలాలకు మట్టి తోలుకుంటున్న తమ వద్దకు వచ్చిన జియావుల్లా డబ్బులు డిమాండ్ చేశాడంటూ వైకాపా నాయకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు.. ఇసుక, ల్యాండ్ అక్రమాల వీడియో తీశారని - YSRCP
YSRCP leaders attack the YouTuber: ఆ ప్రాంతంలో ఇసుకు అక్రమ రవణా, భూముల కబ్జా జరుగుతోంది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జియావుల్లా అనే యూవకుడు ఇదే అంశంపై యూట్యూబ్‌లో కథనాలు ప్రసారం చేశాడు. అధికారులు తనిఖీలు చేస్తున సమయంలో అక్కడికి వెళ్లిన జియావుల్లాపై దాడికి దిగారు వైకాపా నాయకులు.. అక్రమాలపై వీడియోలు చేసినందుకే వైకాపా నేతలు తనపై దాడి చేశారని జియావుల్లా ఆరోపించారు.
యూట్యూబర్‌పై వైకాపా నేతల దాడి