YSRCP Government Negligence on Silk Reeling Centers : బెంగుళూరులోని రామనగర పట్టుగూళ్ల మార్కెట్‌కు ఆసియాలో తొలిస్థానం కాగా, హిందూపురం మార్కెట్ రెండో స్థానంలో ఉంది. అయితే, ఇది గతంలో మాట. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి పట్టుగూళ్లు సాగు చేసే రైతు నుంచి దారం తీసే రీలింగ్ కేంద్రాల యజమానుల వరకు అందరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఓవైపు కరోనా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టు మార్కెట్‌ను కుదేలు చేయగా, మరో వైపు ఆదుకోని జగన్ ప్రభుత్వం తీరు రీలింగ్ కేంద్రాల యజమానులను అప్పులపాలు చేస్తోంది.
Silk Reeling Centers Closing In CM Jagan Ruling in Hindupuram :పట్టుగూళ్లు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరకు అదనంగా ప్రతి కిలోపై రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సాహక ధర ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మల్బరీ రైతులకు జగన్ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు బకాయిపడింది. రైతుల నుంచి పట్టుగూళ్లు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌తో దారం ఉత్పత్తి చేసే రీలింగ్ కేంద్రాలకు, కిలో దారం ఉత్పత్తికి 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీలర్లకు 29 నెలలుగా ఈ మొత్తం విడుదల చేయలేదు. ఒక్క హిందూపురం రీలర్లకే 3.80 కోట్ల రూపాయలు జగన్ సర్కారు బకాయిపడింది. జగన్ 2019 లో ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హిందూపురంలో మల్బరీ రైతులకు, రీలింగ్ యూనిట్ల యజమానులకు అనేక హామీలు ఇచ్చారు. అయితే 29 నెలలుగా ఇన్సెంటివ్ విడుదల కాకపోవటంతో రీలింగ్ యూనిట్ల యజమానులు అప్పులపాలై కేంద్రాలు మూసేస్తున్నారు.
YSRCP Government Closing Skill Training Centers in AP: ఉద్యోగాల ఊసు లేదు.. స్కిల్ కేంద్రాల మూసివేత.. ఉపాధికి దూరంగా ఏపీ యువత
Silk Reeling Units Crisis in AP :పట్టు రీలింగ్ కేంద్రాల ప్రాధాన్యతను గుర్తించిన గత ప్రభుత్వం, వారి విద్యుత్ కనెక్షన్ ను మూడో కేటగిరిలో పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక, రీలింగ్ కేంద్రాలను నాల్గో కేటగిరీలోకి మార్చారు. దీంతో వారికి గతంలో వచ్చే విద్యుత్ బిల్లు మొత్తం మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ రెండేళ్లకు పైగా బకాయి పడటం, కేటగిరీ మార్పుతో విద్యుత్ ఛార్జీ అమాంతం పెరగటంతో రీలింగ్ కేంద్రాల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.