Young man addicts to Drugs: మాదక ద్రవ్యాలకు బానిసలయ్యే యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రించడం కష్టంగా మారుతోంది. నిరంతరం నిఘా పెట్టాల్సిన తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితంలో పట్టించుకోకపోవడం.. లేదా పిల్లలపై అతి ప్రేమతో చేసే చిన్నపాటి నిర్లక్ష్యం పిల్లల జీవితాల్ని నాశనం చేస్తోంది. ఇలాంటి ఘటనే శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
మాదక ద్రవ్యాలకు అలవాటుపడి గొంతు కోసుకున్న యువకుడు - మత్తుకు బానసైన యువకుడు గొంతు కోసుకున్నాడు
Youngman suicide attempt ఓ యువకుడు కొంతకాలంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. మాన్పించేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి మార్పు రాలేదు. వేరే ఊరిలోనైనా ఉంచితే మారుతాడని భావించి అక్కడికి పంపించారు తల్లిదండ్రులు. కానీ మాదక ద్రవ్యాలు దొరకక ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మలకాపురం గ్రామంలో అనంతపురం నగరానికి చెందిన శివ అనే యువకుడు కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతనిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం నగరానికి చెందిన శివ కొంతకాలంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. మాన్పించేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు శివను తమ బంధువుల గ్రామమైన మలకాపురం గ్రామంలో వదిలి వెళ్లారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన శివ.. అవి అందుబాటులో లేకపోవడంతో మానసిక స్థితి సరిగా లేక కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇవి చూడండి: