PM Modi To Inaugurate NACIN Centre: నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్ (National Academy of Customs, Indirect Taxes and Narcotics)ను ప్రారంభించనున్నారు. నాసిన్ ప్రారంభోత్సవాని కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ వద్ద ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాని మోదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శించనున్నారు. ఇందుకోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్లో నాసిన్ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు.
పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో మోదీ వర్చువల్ సమావేశం