TDP leader Paritala Sunitha: రైతుల కోసం చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటే జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధమేనని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలంలో పరిటాల సునీత.. రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోవటం లేదని ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ ద్వారా నీరిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని అన్నారు. పాదయాత్రలో రైతుల నుంచి వస్తున్న స్పందనను చూసి భయంతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులతో కలిసి ముందుకు వెళ్లి తీరుతామని హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం రైతులకు డ్రిప్, విత్తనం రాయితీలు ఇవ్వగా.. వైకాపా ప్రభుత్వంలో ఏ ఒక్క రాయితీ కూడా రైతులకు అందటం లేదని పరిటాల సునీత విమర్శించారు.
రైతుల పాదయాత్ర అడ్డుకుంటే.. జైలుకెళ్లడానికైనా సిద్ధమే: పరిటాల సునీత - ఏపీ తాజా వార్తలు
TDP leader Paritala Sunitha: రైతుల కోసం చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటే జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధమేనని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలంలో పరిటాల సునీత రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
Paritala sunita