Jaggu remanded till December: సత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరులు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తోపుదుర్తి చందు, రాజశేఖర్‌రెడ్డిపై.. సీకే పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. సీకే పల్లికి చెందిన మరికొందరు వైకాపా నాయకులపైనా కేసు పెట్టారు. మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్, మరో నేత పార్థసారథితో పాటు మరికొందరిపై కూడా సీకే పల్లి పీఎస్‌లో సుమోటోగా కేసు పెట్టారు. పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘించారని ఈ కేసులు నమోదు చేశారు. తెదేపా కార్యకర్త జగ్గుపై దాడి చేసిన వైకాపా నాయకులపై బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు.. దాడికి గురైన జగ్గుపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో ధర్మవరం కోర్టు జగ్గును డిసెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.
రాప్తాడు రాజకీయం.. దాడికి గురైన జగ్గుపైనే నాన్ బెయిలబుల్ కేసు - జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు
Non Bailable case against Jaggu: సత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరులు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగ్గుపై దాడి చేసిన వైకాపా నాయకులపై బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు.. దాడికి గురైన జగ్గుపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు జగ్గును డిసెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.
రాప్తాడు రాజకీయం
అసలేం జరిగిందంటే..!:రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడిపై సత్యసాయి జిల్లా గంటాపురానికి చెందిన తెలుగుదేశం నేత జగ్గు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో.. సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి పోలీసులు జగ్గును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జగ్గుకు మద్దతుగా వెళ్లిన తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడి చేశారు. నేతల వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు.
ఇవీ చదవండి: