Mother and Son suicide attempt: హిందూపురం మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన తల్లీతనయులు శకుంతల, నవీన్ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒత్తిడితోనే మున్సిపల్ కమిషనర్ వేధింపులకు గురిచేశారని బాధితుడు నవీన్ భార్య జ్యోతి ఆరోపించారు. ఆమె చెప్పిన వివరాలిలా ఉన్నాయి... ‘30 ఏళ్ల క్రితం శకుంతల పేరుతో పట్టణంలోని డీబీ కాలనీలో ప్రభుత్వం 2.5 సెంట్ల స్థలానికి పట్టా ఇచ్చింది. ఇటీవల ఈ స్థలం మున్సిపాల్టీదంటూ షెడ్డు కూల్చేస్తామని, అక్కడ ఏర్పాటుచేసిన ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించాలని కమిషనర్ పలుమార్లు నోటీసులిచ్చారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న శకుంతల భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయపెడుతున్నారు. ఇందులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రమేయం ఉంది. వేధింపులు భరించలేక పురుగుల మందు తాగారు’ అని పేర్కొన్నారు. నవీన్ బజరంగ్‌దళ్ నాయకుడు. భాజపా, వీహెచ్‌పీ నాయకులు బాధితులను పరామర్శించి మాట్లాడుతూ.. సొంత స్థలంలో ఏర్పాటుచేసిన ఆంజనేయుడి విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వేధింపులకు నిరసనగా గురువారం హిందూపురంలో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఎమ్మెల్సీ వేధిస్తున్నారంటూ.. తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం!
15:23 May 04
ఇలాగైతే పనిచేయలేం
మున్సిపల్ స్థలానికి నకిలీ పట్టా సృష్టించి, వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. అందుకే తాము నోటీసులు ఇవ్వగా వారు హైకోర్టుకు వెళ్లారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం విగ్రహం పేరుతో మరో నాటకం ఆడుతున్నారన్నారు. నోటీసులు ఇవ్వడమే తప్పా.. ఇలాగైతే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. స్థలానికి సంబంధించిన పత్రాలను చూపించారు.
ఇదీ చదవండి :హోం మినిస్టర్ పదవికి ఆమె అనర్హురాలు.. సీపీఎం శ్రీనివాసరావు
TAGGED:
suicide attempt