Clashes in Hindupur YCP : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో ముసలం మొదలైంది. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు స్థానికులకే అప్పగించాలంటూ ఆ పార్టీ నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున స్థానికులకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది . మహమ్మద్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా.. మండలాల వారీగా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి తెలిసేలా చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో వైకాపా నేతలు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీతో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరాం రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు . సమావేశం అనంతరం ఉయ్ వాంట్ లోకల్ అంటూ నినాదాలు చేశారు.
హిందూపురం వైకాపాలో ముసలం... - Clashes in Hindupur YCP
Clashes in Hindupur YCP :శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వైకాపాలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. నియోజకవర్గ బాధ్యతల కేటాయింపుపై విభేదాలు బాహాటమయ్యాయి.

Clashes in Hindupur YCP