Road accident in puttaparthi శ్రీ సత్యసాయి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి తేజస్విని చికిత్స కోసం పోలారక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని శ్రీనివాసపురంకి చెందిన శంకరమ్మ అంజప్ప తనకల్లు మండలం దిగువ తోట్లపల్లి లోని బంధువుల ఇంట్లో జరిగిన కేశఖండన వేడుకలో పాల్గొని మనవరాలుతో కలిసి సొంత ఊరికి తిరుగుప్రయాణంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాఘవేంద్ర స్వల్పంగా గాయాలతో కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారుడ్రైవర్ అతివేగం, ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది - grandparents died
Road accident in puttaparthi కారుడ్రైవర్ అతివేగం కారణంతో ఇద్దరు దుర్మరణంపాలైయ్యారు. మనవరాలితో కలసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హజరై తిరిగి వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాత-అవ్వలు మృతి చెందగా, చిన్నారి చావుబతుకుల మద్య పోరాడుతోంది.
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ
Last Updated : Aug 19, 2022, 12:42 PM IST