ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి కేసులో సుబ్బారావు గుప్తా అరెస్టు.. అందుకేనా..! - ఒంగోలు వైసీపీ నేత అరెస్ట్

YSRCP leader arrested in ganja case in AP: వైసీపీ అసమ్మతి నాయకుడు ఒంగోలు పట్టణం వైశ్య వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. గంజాయి అక్రమ రవాణా, వ్యాపారం చేస్తున్నందున అతడిని అరెస్టు చేశామని డీఎస్పీ వెల్లడించారు. సొంత పార్టీ నేతలైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు ప్రణీత్‌ రెడ్డీలపై నిత్యం సుబ్బారావు గుప్తా విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 1, 2023, 9:33 PM IST

YSRCPleader arrested in ganja case: వైసీపీలో ఉన్నంత కాలం లేదా.. వైసీపీకి అనుకులంగా ఉన్నంత కాలం ఆ పార్టీలోని నేతలపై ఎలాంటి కేసులుండవు.. కానీ ఒక్కసారి పార్టీ నుంచి బయటికి వచ్చాకో లేదా పార్టీపై ఆరోపణలు చేస్తే మాత్రం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వైసీపీ అసమ్మతి నాయకుడిపై కేసు నమోదైంది. సొం త పార్టీ నేతలపై తరచూ ఆరోపణలు చేస్తూ వార్తలో నిలిచే ఒంగోలు వైశ్య వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారు. ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ గంజాయి విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.

గంజాయి అక్రమ రవాణా: వైసీపీ అసమ్మతి నాయకుడు ఒంగోలు పట్టణం వైశ్య వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఒంగోలు పట్టణంలో మోటారు సైకిల్‌ మీద వెళుతుండగా, తాలూకా పోలీసులను చూసి పారిపోతున్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై అనుమానంతో తమ సిబ్బంది పట్టుకొని పరిశీలించారని పోలీసులు తెలిపారు. అనంతరం అతని వద్ద ఒక కిలో 5గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, వ్యాపారం చేస్తున్నందున అతడిని అరెస్టు చేశామని డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు.

ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు ప్రణీత్‌ రెడ్డీలపై గతంలో సుబ్బారావు గుప్తా ఆరోపణలు చేశారు. ఆ సందర్బంలో బాలినేనిపై తీవ్ర వాఖ్యలు చేసారనే నెపంతో గుంటూరులో ఉన్న గుప్తాను బాలినేని అనుచరుడు సుభాని తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసి కేసులు కూడా పెట్టి ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం అధికార పార్టీకి చెందిన వారికి కొరగాని కొయ్యగా ఉన్నాడనే కక్షతో ఇతడిపై అక్రమ కేసులు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ జెండాలు, బ్యానర్లు ముద్రించి అమ్ముకొని జీవించే సుబ్బారావు గుప్తా మీద గంజాయి కేసులు పెట్టడం దురుద్దేశపూర్వంగా జరిగిందేనని పలువురు విమర్శిస్తున్నారు. గంజాయి కేసు విషయంపై విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు డీఎస్పీ సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారు.. అన్నిటికీ 'విచారిస్తున్నాం' అంటూ సమాధానం ఇచ్చారు.

ఇటీవల సుభాని ముఠా మహిళా హాస్టల్​పై దాడి చేసింది. దీనిపై సుబ్బారావు గుప్తా.. పరుషపదజాలంతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన వెంటనే రెండు రోజుల్లోనే సుబ్బురావు గుప్తాను అరెస్ట్​ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అసమ్మతి నేత సుబ్బారావు గుప్తా అరెస్ట్‌

'గంజాయి అక్రమంగా రవాణ చేస్తున్నారనే ఆరోపణలతో సుబ్బారావు గుప్తాను అరెస్టు చేశాం. ఇందులో రాజకీయ, కుట్ర కోణంపై సైతం విచారణ చేస్తున్నాం. ఇందులో మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. సుబ్బారావు గుప్తాపై గతంలో సైతం ఎస్సీ, ఎస్టీ కేసులు ఉన్నాయి. కేసు విచారణలో ఉంది.ఇతనిపై ఎక్సైజ్ కేసు సైతం ఉంది. పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాం.'- నాగరాజు, డీఎస్పీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details