మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపటంపై ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో వైకాపా నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదంపై వైకాపా నేతల సంబరాలు - మూడు రాజధానులపై వార్తలు
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలపడంపై.... రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
Breaking News
సీఆర్డీఏ బిల్లు రద్దు చేయడం, మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నా మూడు రాజధానులు అవసరమని వైకాపా మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు అన్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు