ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lady Councilor Request: సీఐ బారి నుంచి కాపాడండి.. సీఎంకు వైకాపా మహిళా కౌన్సిలర్‌ విన్నపం

Request to CM YS Jagan: వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని సీఎం జగన్​కు విన్నవిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా కౌన్సిలర్ వీడియో విడుదల చేశారు.

suragani laxmi
సూరగాని లక్ష్మి

By

Published : Jan 11, 2022, 10:45 AM IST

వైకాపా మహిళా కౌన్సిలర్‌ వీడియో

Lady Councilor complaint to CM: వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా మహిళా కౌన్సిలర్‌ వీడియో విడుదల చేయడం కలకలం సృష్టించింది. చీరాల ఐదో వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి భర్త నరసింహారావుకు పట్టణంలో బార్‌ అండ్‌ రెస్టారెంటు ఉంది.

డిసెంబరు 31న రాత్రి 11.20 గంటలకు ఒకటో పట్టణ సీఐ రాజమోహన్‌ సిబ్బందితో సహా రెస్టారెంటులోకి వచ్చి.. తన భర్తను దుర్భాషలాడారని, ప్రాధేయపడినా వినకుండా దురుసుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. సిబ్బందిని కొట్టడంతోపాటు తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో ఈనెల 8న రాత్రి మరోసారి రెస్టారెంటుకు వచ్చి.. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించి, అక్కడ ఉన్న వారిని తరిమికొట్టారన్నారు. ఆయన బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ వీడియోలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్థానిక వైకాపా నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మరింత అగ్గి రాజేసింది.

ఈ విషయమై సీఐ రాజమోహన్‌ను వివరణ కోరగా.. నూతన సంవత్సరం రోజున బార్‌లోంచి కేకలు వినపడటంతో తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని చెప్పారు. ఎవరిపైనా దాడి చేయలేదని, దూషించలేదని తెలిపారు. ఈ నెల 8న బార్‌లోకి వెళ్లలేదని.. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Love on own village: మాతృభూమిపై ప్రవాసుడి ప్రేమ.. 28 ఏళ్లుగా అన్నీ తానై

ABOUT THE AUTHOR

...view details