ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరిలో చిక్కిన వైకాపా చీరలు - ysrcp

నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అలాంటి ఎత్తు వేయబోయే కనిగిరిలో వైకాపా నేతలు అడ్డంగా బుక్కయ్యారు.

కనిగిరిలో వైకాపా చీరల పంపకం

By

Published : Mar 9, 2019, 12:27 PM IST

చీరలు పంచుతున్న వైకాపా కార్యకర్తలు
ప్రలోభాల పర్వం

నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరికొన్ని పార్టీలు ఓ అడుగు ముందుకేసి ప్రజలను ప్రలోభ పెట్టే పనికీ సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మిఠాయి పొట్లాలు, చీరలు, బొట్టుబిల్లలు ఇలా ఏ అవకాశాన్ని నేతలు విడిచిపెట్టడం లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రలోభ పెట్టేందుకు వచ్చిన నేతలకు ఊహించను అనుభవం ఎదురైంది.
చీత్కారాలు

ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పీనీ పల్లి మండలంలో వైకాపా కార్యకర్తలు గ్రామాల్లో చీరలు పంపిణీ చేశారు. కనిగిరి వైకాపా ఇంచార్జ్ బుర్రా మధుసూదన్​ యాదవ్​ పేరుతో చీరలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. వారి ఎత్తులు సాగలేదు. వైకాపా శ్రేణులు ఇచ్చిన చీరలు తీసుకునేందుకు సీఎస్‌పురం ప్రజలు అంగీకరించలేదు. మరికొందరు మరో అడుగు ముందుకేసి... వాటిని తగులపెట్టారు.

అందని ఫిర్యాదు
తెలంగాణలో గత ఎన్నికల్లో పంచగా మిగిలిపోయిన చీరలు ఇక్కడ ఇచ్చేందుకు సిద్ధపడ్డారా అంటు నిలదీశారు. ప్రలోభాలు మానుకోవాలని హితవుపలికారు. పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details