YCP faction war: ప్రకాశం జిల్లా ముండ్లమురు మండలం కొమ్మవరంలోని వైసీపీ వర్గపోరు ప్రభావం దేవాలయాన్ని తాకింది. కొమ్మవరంలో గ్రామస్థులంతా కలిసి 50లక్షల రూపాయలతో పునర్ నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. పునఃప్రారంభోత్సవ సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు రావటంతో.. ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఆలయ పునఃప్రారంభ వేడుకలు నిలిచిపోయాయని స్థానికులు చెప్తున్నారు.
వైసీపీ వర్గపోరుతో భగవంతునికి తప్పని తిప్పలు - హనుమాన్ ఆలయ పున ప్రారంభోత్సవ కార్యక్రమం
YCP faction war: ప్రకాశం జిల్లా ముండ్లమురు మండలం కొమ్మవరం గ్రామ వైసీపీలోని వర్గపోరు ప్రభావం భగవంతునికి తాకింది. మండలంలోని ఈదర పంచాయతీ పరిధి కొమ్మవరంలో గ్రామస్తులు ఒక్కటై రూ.50లక్షలతో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
temple
గ్రామంలో ఉన్న ఒక్క దేవాలయంలో నిత్య కృత్యాలైన ధూప, దీప, నైవేద్యాలు స్వామి వారికి సమర్పించాలి. అలా చేయక పోవటం వలన గ్రామానికే అరిష్టం అని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరువర్గాలు వైషమ్యాలు మాని భగవంతుని కార్యక్రమానికి అందరూ కలసి కట్టుగా ముందుకి రావాలని, పంతాలు వీడి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: