ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

ప్రకాశం జిల్లా చీరాలలో తెదేపా కార్యకర్తపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి.

By

Published : Apr 10, 2019, 5:34 PM IST

యువకుడిపై కత్తితో దాడి

యువకుడిపై కత్తితో దాడి

ప్రకాశం జిల్లా చీరాలలోని గోరంట్ల సుబ్బారావు ఆసుపత్రిలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెదేపా అభ్యర్థి కరణం బలరాం కుమారుడు వెంకటేష్​ అనుచరుడు గోగులమూడి రాజశేఖర్​పై... ఆస్పత్రి ఆవరణలో దాడి చేశారు. చేయి అడ్డు పెట్టడంతో బలమైన గాయాలయ్యాయి. రాజశేఖర్​ను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నాగరాజు బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. దాడి చేసినవారు మనోజ్, వెంకటేష్​గా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details