ప్రకాశం జిల్లా చినగంజాం మండలం చింతగుంపలలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చీరాల జయంతిపేటకు చెందిన బ్లెస్సీ (20)ని చింతగుపలకు చెందిన వడ్డెంపూడి కిరణ్ అనే యువకుడికి ఇచ్చి రెండు నెలల క్రితం వివాహం చేశారు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య కలహాలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్లేస్సీ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బ్లెస్సీ మృతికి భర్త కిరణ్‌కుమారే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై అనుమానాలు ! - వివాహిత అనుమానస్పద మృతి న్యూస్
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చింతగుంపలలో చోటు చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే బ్లెస్సీ మృతి చెందగా..ఆమె మృతికి భర్తే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
వివాహిత అనుమానస్పద మృతి
Last Updated : Oct 11, 2021, 10:19 PM IST