ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికులకు నేత పోటీలు

ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికుల నేతపోటీలు జరుగుతున్నాయి. మొత్తం 170 నేతన్నలు పోటీ పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డిజైన్లు వేసిన వారు విజేతలుగా నిలువనున్నారు. నేతపోటీల ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎస్. రంజన తెలిపారు.

Breaking News

By

Published : Jan 15, 2021, 1:48 PM IST

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు నేతపోటీలు ఉపయోగపడతాయని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎస్. రంజన అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో రాష్ట్ర చేనేత జనసమైఖ్య, సొసైటీ ఫర్ వెల్ఫర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, హ్యండీ క్రాప్ట్స్ ఆధ్వర్యంలో చేనేతలకు నేతపోటీలు నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరగనున్న పోటీలకు 170 మంది నేత కార్మికులు పాల్గొంటున్నారు. 11 రకాల వస్త్రఉత్పత్తి రకాలు పోటీల్లో నేసి బహుమతులు పొందవచ్చని.. ఒక్కో రకాన్ని బట్టి సమయం కేటాయించనున్నారు. ఎవరు తక్కువ సమయంలో డిజైన్ బాగా వేస్తారో.. నేత విధానం బాగున్నవారిని విజేతలుగా ప్రకటిస్తారు.

ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికులకు నేతపోటీలు

పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 18న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో క్రాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆంధ్రాలో నేసిన 'గడ్డి చీర' అమెరికాలోనూ ఫేమస్!

ABOUT THE AUTHOR

...view details