ఒంగోలులో మూడ్రోజులకొకసారి మాత్రమే మంచి నీరు సరఫరా అవుతుంది. ఇలా విడుదలయ్యే నీటిలో అధికశాతం పైపుల లీకులతో నేలపాలు అవుతుంది. ఈ వృథాతో శివారు ప్రాంతాల వారికి నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకులకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం...తాగు నీరు వృథా - ongole urban
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగేందుకు చుక్క నీరు లేక ప్రజల గొంతెండుతుంటే..ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం నీటిని వృథా చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగర పరిధిలోని కొప్పోలు 9, 10 డివిజన్లకు మంచినీరు అందించే పైపు లైన్ లీకై.. రెండ్రోజులుగా నీరు వృథా అవుతున్నా అధికారులు మాత్రం అలక్ష్యము వహిస్తున్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం...తాగు నీరు వృథా