ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని కురుచేడు రోడ్డులోగల ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు ఆవరణలో.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శిద్దారాఘవరావు, శిద్దా ట్రష్టు ద్వారా ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా.. ప్రజల దాహార్తి తీర్చేవారు. ఇప్పుడు ప్రభత్వం మారేసరికి స్థానిక వైకాపా నాయకులు శుద్ధ జల కేంద్రానికి తమ పార్టీ రంగులు వేశారు.
దర్శి శుద్ధ జల కేంద్రానికి.. ''రాజకీయ రంగులు''
దాతల సహాయంతో దాహeర్తిని తీర్చే శుద్ధనీటి కేంద్రాలకూ రాజకీయ రుచి చూపిస్తున్నారు వైకాపా నేతలు. ప్రభుత్వం మారిందన్న కారణంతో నీటి కేంద్రానికి పార్టీ రంగులు పూశారు.
నీటి కేంద్రాలనూ రాజకీయం చేసిన వైకాపా నేతలు
ఇప్పటివరకు సేవాభావంతో ట్రష్టుద్వారా శుద్ధ జల కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి.. ఈ పరిణామంతో కేంద్రానికి తాళాలువేసి దాతలకు అప్పగించారు.ఈ రాజకీయ కారణాలతో మంచినీరు అందక , గత మూడురోజులుగా వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అయినా... అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో ఆలోచించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి:గుంతలో పడిన గోమాత..ప్రొక్లైన్ సాయంతో బయటకు