ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమంచికి అసమ్మతి సెగ - చీరాల రాజకీయం

చీరాల రాజకీయం వేడెక్కుతోంది. తమను కాదని వైకాపాలో చేరిన ఎమ్మెల్యే ఆమంచికి టికెట్ ఇస్తారన్న సమాచారంతో అసమ్మతి గొంతు గట్టిగానే..వినిపిస్తోంది.

ఆమంచికి అప్పుడే అసమ్మతి సెగ

By

Published : Feb 18, 2019, 6:47 AM IST

Updated : Feb 18, 2019, 10:05 AM IST

చీరాల వైకాపాలో వర్గపోరు
తాజాగా వైకాపాలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్​కు వ్యతిరేకంగా అసమ్మతి సెగ రాజుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడుల చేయించిన ఆమంచికి చీరాల టికెట్ ఇవ్వొద్దని గళం వినిపిస్తోంది. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించటం పున:సమీక్షించుకోవాలని వైకాపానేత చుండూరి వాసు సూచించారు. ప్రకాశం జిల్లా చీరాలలో డా.వరికూటి అమృతపాణి యూత్ ఆధ్వర్యంలో వైకాపా సమావేశం నిర్వహించింది. ఆమంచికి టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమని అమృతపాణి అన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పోరాడుతున్న తమకు ఇవ్వకుండా వేరేవరికి సీటు ఇస్తే ఊరుకోమన్నారు. ఇదే విషయంపై త్వరలో జగన్​కు కలిసి వివరిస్తామన్నారు.
Last Updated : Feb 18, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details