ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు - Andhra Pradesh latest news

Takaripalem Villagers Stopped MLA Burra Madhusudan : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.

gadapa gadapa
గడపగడప

By

Published : Dec 31, 2022, 8:49 AM IST

Takaripalem Villagers Stopped MLA Burra Madhusudan : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రావద్దంటూ టకారిపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, స్థానిక మసీదు చుట్టూ మురుగునీరు నిలిచి దుర్గందం వస్తుందని వార్డు కౌన్సిలర్లకు, సచివాలయ ఉద్యోగులకు, అధికారులకు విన్నవించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామంలోకి ఎమ్మెల్యే రాకుండా అడ్డుకున్న గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details