ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీని నమ్మి అప్పులు చేసి ఊరి అభివృద్ధి.. కానీ.. - అప్పులు చేసిన సర్పంచ్

Village Developed By Sarpanch: ఆయన అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌. ప్రభుత్వం తమదే అన్న ధీమాతో అప్పులు చేసి మరీ ఊరిలో అభివృద్ధి పనులు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు మాత్రం రాలేదు. దీంతో పూట గడవని పరిస్థితికి చేరుకున్నారు. పొలం, ట్రాక్టర్లు అమ్మేసి...చివరకు ఇంటినీ తాకట్టు పెట్టేశారు. ఇదీ రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి షేక్‌ మహ్మద్‌ రసూల్‌ పరిస్థితి. గ్రామాల్లో వాలంటీర్లకు పెత్తనం ఇచ్చిన ప్రభుత్వం...సర్పంచ్‌లకు ఎలాంటి దీనావస్థ తెచ్చిందో చెప్పడానికి రసూల్‌ దుస్థితే నిదర్శనం. గ్రామస్థులకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో 17ఏళ్ల వయసులో ప్రకాశం జిల్లాకు చెందిన రసూల్ రాజకీయాల్లోకి వచ్చారు.

SARPANCH
SARPANCH

By

Published : Jan 12, 2023, 7:51 AM IST

Updated : Jan 12, 2023, 9:59 AM IST

Village Developed By Sarpanch: గ్రామస్థులకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో 17ఏళ్ల వయసులో ప్రకాశం జిల్లాకు చెందిన రసూల్ రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు 25 ఏళ్లపాటు టీడీపీ కార్యకర్తగా కొనసాగారు. 2007లో ఎడమ భుజంపై వచ్చిన క్యాన్సర్ గడ్డను తొలగించుకోవడానికి కొందరు నాయకుల ద్వారా అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స, కీమోథెరపీ చేయించుకున్నారు. అప్పటి నుంచి వైఎస్‌ఆర్‌ అంటే గౌరవం ఏర్పడి.... ఆ తర్వాత వైసీపీ మద్దతుదారుగా మారారు. ఆ పార్టీ నుంచే తొలుత కోడలిని సర్పంచ్‌గా గెలుపించుకున్నారు. రెండేళ్ల క్రితం చినకంభం నుంచి సర్పంచ్‌గా రసూలే గెలిచారు.

ఊరికి మంచి చేయాలనే ఆలోచనతో... అప్పులు చేసి మరీ అనేక అభివృద్ధి పనులు చేశా. వీటికి సంబంధించిన బిల్లులు మాత్రం రాలేదు. ప్రభుత్వం నుంచి 83 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటికీ రాలేదు. -రసూల్, చినకంభం సర్పంచ్

అప్పులు తీర్చేందుకు రసూల్‌కు అతడి సోదరుడు, గ్రామస్థులు సాయపడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో తీరలేదని రసూల్‌ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని రసూల్‌ కోరుతున్నారు.

ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందుల్లో సర్పంచ్‌

ఇవీ చదవండి

Last Updated : Jan 12, 2023, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details