ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వెలుగొండ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తిచేయాలి' - ప్రాజెక్ట్

13 జిల్లాల పర్యటనలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాల మండలం కొత్తూరులో పర్యటించారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ తొలి సొరంగం పనులను పరిశీలించారు.

సీపీఐ రామకృష్ణ

By

Published : May 14, 2019, 6:42 AM IST



ఈనెల 23 తరువాత రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్​కు ప్రాధాన్యతనిచ్చి అవసరమైన నిధులు కేటాయించి.. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 13 జిల్లాల పర్యటనలో భాగంగా.. సోమవారం ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాల మండలం కొత్తూరులో పర్యటించారు. వెలుగొండ ప్రాజెక్ట్ తొలి సొరంగం పనులను పరిశీలించారు. జరుగుతున్న పనుల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. పోలవరం తరువాత వెలుగొండ అత్యధిక ప్రాధాన్యం గల ప్రాజెక్ట్ అని అన్నారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సీపీఐ రామకృష్ణ

ABOUT THE AUTHOR

...view details