ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి: తితిదే ఛైర్మన్ - ttd chairman yv subbareddy praises cm jagan

రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

veligonda project
veligonda project

By

Published : Dec 6, 2020, 4:34 PM IST

రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని దాదాపు రూ.4 కోట్ల నిధులతో నిర్మించనున్న తితిదే కల్యాణ మండపం, మార్కెట్ యార్డ్ పరిపాలన భవనాలకు మంత్రి సురేశ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు సీఎం జగన్.. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులన్నీ కేటాయించామన్నారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు పనులు ఆగిపోయాయని వివరించారు. అతి త్వరలోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details