తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన యువకుడు కిలారి బాలకృష్ణ పాదయాత్ర చేస్తున్నారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం ఎన్నికల్లో గెలిచి మంత్రి కావాలనీ ఆయన ప్రార్థిస్తున్నారు. ఈ నెల 12న చీరాల నుంచి యాత్ర మొదలుపెట్టిన బాలకృష్ణ.. ఒంగోలుకు చేరుకున్నారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా.. చంద్రబాబే తిరిగి అధికారంలోకి రావాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కరణం బలరాం గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ.. పాదయాత్ర - ముఖ్యమంత్రి
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుపతికి బయలుదేరిన యువకుడి పాదయాత్ర ఒంగోలుకి చేరింది.
కిలారి బాలకృష్ణ