సింగరాయికొండలోని ఊరి చివరన సారుగుడు తోట వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ,దాడులకు దారితీసింది. ఒక వర్గానికి చెందిన యువకుల బంధువైన ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఇద్దరి యువకులను కొట్టారు. అనంతరం దాడి చేస్తున్న దృశ్యాలను నలుగురిలో ఒకరు చరవాణిలో చిత్రీకరించి మిత్రుల గ్రూప్ లో పోస్ట్ చేశాడు. చివరికి ఆ వీడియో పోలీసుల వరకు చేరింది. దీనిపై స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ,కేసు నమోదు చేశారు.
ఊరి చివరి తోటలో కొట్టుకున్నారు... ఎందుకంటే? - The clash between two youths
ప్రకాశంజిల్లా సింగరాయికొండలో ఇద్దరు యువకులపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు వారిపై కేసు నమోదుచేసారు.
The clash between two youths at Sarugadu Gardens on the outskirts of Singaraikonda has led to the attacks at prakasham district