ప్రకాశం జిల్లా చినగంజాం మండలం గొనసపూడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావటంతో... నిత్యావసరాలకు అవస్థలు పడుతున్నారు. స్థానికుల ఇబ్బందిని గుర్తించిన ప్రకాశం జిల్లా తెదేపా కార్యదర్శి విక్రం నారాయణరావు 700 మందికి 10 కిలోల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చినగంజాం తహసీల్దార్ పాల్గొన్నారు.
గొనసపూడిలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ
ప్రకాశం జిల్లా గొనసపూడిని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో గ్రామస్థులకు తెదేపా నేత విక్రం నారాయణరావు కూరగాయల పంపిణీ చేశారు.
గొనసపూడిలో కూరగాయల పంపిణీ