మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఓ విద్యార్థిని చేత తాగించి.. నగ్నచిత్రాలను సెల్ఫోన్లో తీశాడో విద్యార్థి. వాటిని సోషల్ మీడియాలో మరో యువకుడు పోస్టు చేశాడు. ఈ దారుణంపై ఫిర్యాదు అందడంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల స్టేషన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు ఇటీవల మార్కాపురం వచ్చింది.
కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. నగ్న చిత్రాలు తీసి - student shares girls nude photos latest news
Girl nude photos on Social Media: మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని విద్యార్థిని చేత తాగించి నగ్నచిత్రాలను చరవాణిలో చిత్రీకరించాడో విద్యార్థి. వాటిని మరో యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ దారుణంపై ఫిర్యాదు అందడంతో వారిద్దరినీ అరెస్టు చేసిన ఘటన.. ప్రకాశం జిల్లాలో జరిగింది.
పరిచయం ఉండటంతో మీరావలి పలకరించాడు. శీతల పానీయం తాగుదామంటూ పిలిచాడు. అందులో మత్తు పదార్థం కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. విద్యార్థినిని వివస్త్రను చేసి చరవాణిలో చిత్రీకరించాడు. ఆ చిత్రాలను చూసిన మీరావలి స్నేహితుడు, మోకానిక్ డి.రసూల్(22) వాటిని సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం రాత్రి పెద్దదోర్నాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయాన్ని తెలిపారు. ఎస్సై సీఐ మారుతీకృష్ణ వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నాగూర్ మీరావలి, రసూల్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: