ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగుల్లో పరిశ్రమల వ్యర్థాలు... వానొస్తే గుప్పిట్లో ప్రాణాలు

గ్రానైట్‌ పరిశ్రమలు ఏర్పాటుతో ఉపాధి, వ్యాపార అవకాశాలు ఎంత పెరిగాయో... పర్యవరణానికి అంత నష్టం జరుగుతోంది. వ్యర్థాలతో కాలువలు, వాగులు దాదాపు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. పాలిషింగ్‌ యూనిట్‌ నుంచి వచ్చే ద్రవ వ్యర్థాలతో జలవనరులు సున్నపు బట్టీల్లా తయారవుతున్నాయి.

By

Published : May 3, 2019, 7:19 AM IST

వ్యర్థాలను వాగులోకి పోస్తున్న కూలీలు

మూసుకుపోతున్న వాగులు

ప్రకాశం జిల్లా చీమకుర్తి, పొదిలి మండలాల్లో భారీ స్థాయిలో గ్రానైట్‌ పరిశ్రమలున్నాయి. వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీటి వల్ల ఆ ప్రాంతంలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ... పరిశ్రమల నిర్వహణ లోపాలతో పర్యావరణ హననం జరుగుతోంది. పొదిలి, చీమకుర్తి మండలాల్లో సుమారు 200 పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. గ్రానైట్‌ కోయడం, మెరుపు తీసుకొచ్చే విధంగా పాలిష్‌ చేయడం ఈ పరిశ్రమల పని. ఇక్కడ పెద్ద ఎత్తున వ్యర్థ గ్రానైట్‌, ద్రవ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

ముడుపులందుకుని మాట ఎత్తని అధికారులు

పరిశ్రమల వ్యర్థాలను పారవేసేందుకు ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడే వీటిని పోయాలి. గుంతలు తీసి ద్రవ వ్యర్థాలు కప్పిపెట్టాలి. ఏ పరిశ్రమ కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడంలేదు... ఈ వ్యర్థాలను సమీపంలో ఉన్న వాగుల్లో, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని పారపోస్తున్నారు... పొదిలి, చీమకుర్తి మధ్యలో ఉన్న మూసి కాలువలో విచ్చలవిడిగా గ్రానైట్‌ వ్యర్థాలు పారపోయడం వల్ల వాగు మూసుకుపోయే పరిస్థితి నెలకొంది... గతంలో నిండుగా పారే ఈ వాగు ఇప్పుడు వ్యర్థాలతో నిండిపోయి, చుక్కనీరు ప్రవహించే పరిస్థితి కనిపిండంలేదు..గ్రానైట్‌ వ్యర్థాలను వాగుల్లోకి మళ్ళించవద్దని అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడంలేదని , మామూల్లు తీసుకొని గ్రానైట్‌ పరిశ్రమల యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నీరు ఉన్నా వాడుకోలేని దుస్థితి
మూసి కాలువకు వచ్చే ఉప కాలువల పరిస్థితి కూడా అదే విధంగా గ్రానైట్‌ వ్యర్థాలతో నిండిపోతుంది... వాగుల్లో నీటి నిల్వలు పెంచాలనే ఉద్దేశ్యంతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం అక్కడక్కడా నీటి కుంటలను తవ్వించింది. ఆ కుంటల్లో కూడా గ్రానైట్‌ ద్రవ వ్యర్థాలతో నింపేసారు. గతంలో సాగు, తాగునీటి అవసరాలకోసం ఈ వాగులను వినియోగించుకునే వాళ్లమని, ఇప్పుడు వ్యర్థాలతో నిండిపోయినందున వర్షాకాలంలో కూడా ఈ నీటిని వినియోగించులేని పరిస్థితి ఏర్పడుతుంది, జీవాలు వంటివి నీటిని తాగితే మృత్యవాత పడుతున్నాయని... వాగంతా విషతుల్యమైతుందని ప్రజలు వాపోతున్నారు.. వరదలు వంటివి వస్తే, నీటి ప్రవాహానికి దారిలేక వరదనీరు గ్రామాలపై పడి తీవ్ర నష్టాలకు గురిచేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టి పెట్టి ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని కాపాడాలని, గ్రానైట్‌ యూనిట్లమీద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details