ప్రకాశం జిల్లాలో కొవిడ్ నేపథ్యంలో.. పోలీస్ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపేందుకు ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ కానిస్టేబుళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. కరోనా సమయంలో ప్రజా సేవలో పోలీసులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని.. వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా అవసరం ఉందని ఎస్పీ కోరారు. కొవిడ్ నియంత్రణకు, కుటుంబ సభ్యులకు వైరస్ సోకకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పోలీసు కుటుంబాలకు భరోసా...
కొవిడ్ సెంకడ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో.. పోలీసు సిబ్బంది కుటుంబీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కానిస్టేబుళ్ల ఇంటికి వెళ్లారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా బయటకు వచ్చేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని... వారి వాహనాలు జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు.
పోలీసు కుటుంబాలకు భరోసా
అనంతరం మధ్యాహ్నం 12 గంటలు తరువాత రోడ్లపై తిరుగుతున్న ద్విచక్రవాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, విచ్చలవిడిగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు బైక్ లను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సోనుసూద్‌పై అభిమానం.. ఆరడుగుల అద్భుత చిత్రం!