ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నకొడుకా...?... కాలయముడా..? - undefined

కన్నకొడుకే యమపాశంగా మారాడు. పున్నామ నరాకాన్ని దాటిస్తాడనుకున్న ఏకైక కుమారుడే... కన్నవాళ్లను కాటికి పంపించాడు. చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం వృద్ధతల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేసి... సహజమరణంగా చిత్రీకరించి బీమా డబ్బులు కొట్టేద్దామని ప్రయత్నించాడు. తీరా ఈ కేసులో కీలక ఆధారాలు దొరికేసరికి పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.

కన్నకొడుకా...?... కాలయముడా..?

By

Published : Jul 27, 2019, 9:25 AM IST

Updated : Jul 27, 2019, 1:04 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలోని దేవారి వీధిలో ఈ నెల 22న వృద్ధదంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. సొంత ఇంట్లోనే విగతజీవులుగా పడిఉన్న వృద్ధ దంపతులది తొలుత ఆత్మహత్యగానే అందరూ భావించారు. వారి కుమారుడు నారాయణరెడ్డిపై స్థానికులు సందేహం వ్యక్తం చేయడమే కాక.. ఇంట్లోని బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ వేగవంతం చేశారు. కీలక ఆధారాలు దొరికేసరికి దిక్కులేక నారాయణరెడ్డి నేరాన్ని అంగీకరించాడు. హత్య ఎలా చేసిందీ పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించాడు.

వ్యసనాలకు బానిసై ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిన నారాయణరెడ్డి... ఆ అప్పులు తీర్చేందుకు సులువుగా డబ్బులు సంపాదించే మార్గం వెతికాడు. కొడుకు కష్టాలు చూసిన తల్లిదండ్రులు వారికున్న ఆస్తులను అమ్మి కొన్ని అప్పులు తీర్చారు. అయినా నారాయణరెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు. మరిన్ని అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించేందుకు తల్లిదండ్రులను చంపాలనుకున్నాడు. అలా చేస్తే బీమా డబ్బులు వస్తాయనే దురాలోచన మదిలో మెదలగానే... నేరానికి ప్రణాళికలు రచించాడు. ముందుగా తల్లిదండ్రుల పేరు మీద 15 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాడు. ఈ నెల 21 రాత్రి వారికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేద్దామనుకున్నాడు. అయినా వారు కొనఊపిరితో ఉండటంతో గొంతునులిమాడు... అప్పటికీ ఊపిరి ఉండటంతో కత్తిపీటతో గొంతు, కణితలు కోసి హత్య చేశాడని పోలీసులు వివరించారు.

తల్లి దండ్రులను చంపిన కొడుకు
Last Updated : Jul 27, 2019, 1:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details