ప్రకాశం జిల్లా చీరాలలో మంగళవారం సాయంత్రం ఆకాశం అద్భుత వర్ణాలను వెదజల్లింది. సాయం సంధ్య సమయంలో ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు చీరాల పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గిన తరువాత ఆకాశం నీలం, ఎరుపు రంగుల కలయికగా కనిపించింది. రాత్రి ఏడు గంటలవరకు ఎర్రగా ఉన్న ఆకాశాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
చీరాల.. ఈ అద్భుతాన్ని మనమంతా చూడాల..! - _RED_SKY
చీరాల పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆకాశం నీలం, ఎరుపు వర్ణాల కలయికగా కనిపించింది. పట్టణంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. అనంతరం ఈ అద్భుత దృశ్యం తారసపడింది.
చీరాలలో నీలాకాశ అద్భుత వర్ణాలు