ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత విధానంలోనే బిల్లులు తీసుకోవాలి: సీపీఐ - CPI

కరెంటు బిల్లులు 2 నెలలకు ఒకసారి తీయడం వలన శ్లాబు రేట్లు మారి.. ప్రజలకు భారమవుతోందని సీపీఐ నేతలన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.

Shock with current bills
కరెంటు బిల్లులతో కొడుతున్న ‘షాక్’

By

Published : May 13, 2020, 2:14 PM IST

లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్ళకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నేత మేడ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో కరెంటు బిల్లుల శ్లాబ్ రేట్ మార్చి.. ముప్పై రోజులకు తీయాల్సిన రీడింగ్ ను 60 రోజులకు తీస్తున్న కారణంగా ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రజలకు అండగా నిలిచి పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చీరాల కార్యదర్శి బత్తుల శామ్యూల్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details