'చిట్టి బుర్రల పెద్ద ప్రయోగాలు'
ఆ చిట్టి చేతులు అద్భుతాల్ని చేశాయి. ఆ చిన్ని బుర్రలు పెద్దలకే పాఠాలు నేర్పించాయి. పెద్ద పెద్ద సైన్స్ నమూనాలను తయారుచేసి.. వాటి పనితనాన్ని వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యాలు సైన్స్ ఎగ్జిబిషన్లో ఆవిష్కృతమయ్యాయి.
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
ప్రకాశం జిల్లా కంభంలోని పలు పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాలైన సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన నమూనాలు ప్రదర్శించారు. కొన్ని కొత్త నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటికి సంబంధించిన వివరాలను విద్యార్థులు చక్కగా వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.