సాగర్ నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మంచినీటి చెరువులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో గుర్తించి.. వాటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లాలోని అద్దంకి బ్రాంచి కెనాల్‌కు సాగర్ జలాలు విడుదల చేశారు. సంతమాగులూరు మండలం పరిధిలోని అడవిపాలెం 18/0 వద్ద 585 క్యూసెక్కుల నీరు అద్దంకి బ్రాంచి కాలువలో చేరుతోంది. అడుగడుగునా పర్యవేక్షిస్తూ అధికారులు చెరువును నింపుతున్నారు.
అద్దంకికి సాగర్ జలాలు విడుదల - అద్దంకి
తాగునీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లాలోని అద్దంకి బ్రాంచి కెనాల్‌కు సాగర్ జలాలు విడుదల చేశారు. సంతమాగులూరు మండలం పరిధిలోని అడవిపాలెం 18/0 వద్ద 585 క్యూసెక్కుల నీరు అద్దంకి బ్రాంచి కాలువలో చేరుతోంది.
ప్రకాశం జిల్లా అద్దంకికి సాగర్ జలాలు