ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. చిలకలూరిపేట డిపోకు చెందిన బస్సు చీరాల వస్తుండగా ప్రమాదం జరిగింది. పర్చూరు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి పంటకాలువలోకి ఒరిగింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పెద్దప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డామని ప్రమాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులు క్షేమం - busaccident
ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో ఆర్టీసీ బస్సు పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి పంటకాలువలోకి వెళ్లింది.
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులు సురక్షితం