ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Granite: చీమకుర్తిలో సర్కారు గ్రానైట్‌ వేట..సమీప గ్రామాలకు ఉండదు బాట !

ఆ ప్రాంతంలో భూమి కింద కోట్ల విలువైన గ్రానైట్‌ (granite excavation at chimakurthy) ఉంది. భూమిపైన..ఆ ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడే ఒంగోలు-కర్నూలు రహదారి పోతోంది. ఈ ప్రాంతంలోని గ్రానైట్‌పై ప్రైవేటు సంస్థలు కూడా కన్నేయడంతో..ఈ మార్గాన్ని ప్రభుత్వం ఏపీఎండీసీకి కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం మార్చడం వల్ల అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.

By

Published : Oct 12, 2021, 9:21 PM IST

చీమకుర్తిలో సర్కారు గ్రానైట్‌ వేట
చీమకుర్తిలో సర్కారు గ్రానైట్‌ వేట

చీమకుర్తిలో సర్కారు గ్రానైట్‌ వేట

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌కు (granite excavation at chimakurthy) విదేశీ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఈ ప్రాంతంలోని బ్లాక్‌ గెలక్సీ గ్రానైట్‌ను పలు క్వారీ సంస్థలు వెలికితీస్తున్నాయి. ఏపీ మైనింగ్‌ కార్పొరేషన్‌ భూముల్లో కూడా క్వారీయింగ్‌ నిర్వహిస్తున్నారు. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం గ్రామాల మధ్య గెలక్సీ గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల మధ్య కర్నూలు-ఒంగోలు ప్రధాన రహదారి ఉంది. ఈ మార్గంలో 24 నుంచి 28 కిలోమీటర్ల వరకు..దిగువన గ్రానైట్ నిక్షేపాలు ఉండటంతో తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రహదారిని తొలగించి క్వారీయింగ్‌ చేసేలా ఏపీఎండీసీకి.. ఈ ప్రాంతాన్ని కేటాయిస్తూ గత నెల 30న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

మైనింగ్‌ కార్పొరేషన్‌కు ఈ ప్రాంతం కేటాయించడం వల్ల..కొన్ని గ్రామాలు రోడ్డు సౌకర్యం కోల్పోవాల్సిన పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం రామలింగేశ్వరస్వామి దేవాలయానికి దారి లేకుండా పోతుంది. చీమకుర్తి పట్టణానికి కూడా దూరం పెరిగిపోతుందని..తమ వ్యాపారలపై ప్రభావం పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రానైట్ తవ్వకం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రానైట్ నిక్షేపాల కోసం రహదారిని ధ్వంసం చేయటం సరికాదు. ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోంది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలి. -స్థానికుడు

గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పట్లో ఆయా గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, కొత్త రహదారి నిర్మాణం తలకుమించిన భారం కావడం వల్ల ఆ ప్రతిపాదనను వెనుక్కు తీసుకుంది. ఆ ప్రతిపాదనను మళ్లీ బయటకు తీసి ఏకంగా కార్యాచరణలోకి దిగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి

KRMB: ఈనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి.. కృష్ణా బోర్డు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details