ప్రకాశం జిల్లా సంజీరావుపేట సమీపంలో 750 కేజీల రేషన్ బియ్యం తరలిస్తుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఖాన్ పట్టుకొని స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు... రోజూ ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది.. దీన్ని ఆయా శాఖా అధికారులు పట్టించుకోవడం లేదా... ? లేక ప్రభుత్వం చొరవచూపడం లేదా..? ఇవన్నీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలే... అక్రమార్కుల లాభాలకు అడ్డుకట్టవేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పెరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలింపు...! - రేషన్ బియ్యం
మెన్న విశాఖపట్నం ..నిన్న కర్నూలు ..నేడు ప్రకాశం .... ! రేషన్ బియ్యం అక్రమ రవాణాల వరుస క్రమం ఇది... వీటిని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతుంది.. ఇదేమైనా చిన్నవిషయమా...? పేదోడికి ప్రభుత్వం అందించే సాయం ..మరెందుకు ఇలా అక్రమ దారి పడుతుంది..
రేషన్ బియ్యం తరలింపు