ఇదీ చూడండి:
మార్కాపురంలో వైభవంగా శివపార్వతుల రథోత్సవం
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆరవ రోజు ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి రథాన్ని పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను వేదమంత్రాల నడుమ రథంపై ప్రతిష్టించారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రథాన్నిలాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలు చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. రథంపై శివపార్వతుల వైభవాన్ని దర్శించేందుకు అశేష భక్త జనం తరలింది.
మార్కాపురంలో వైభవంగా జరిగిన రథోత్సవం