ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిశ్చార్జ్ అయ్యాడన్నారు... కానీ మృతి చెందాడు..! - protest in ongole

ఆసుపత్రి సిబ్బంది చనిపోయిన వ్యక్తిని గుర్తించకుండా డిశ్చార్జ్​ అయ్యాడని చెప్పిన ఘటనపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాధితుడు మరణించాడని ఆందోళన చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్​ వద్ద జరిగింది.

protest against to ongole ggh hospital doctors in prakasham district
ఒంగోలు జీజీహెచ్ ఎదుట ఆందోళన

By

Published : Sep 25, 2020, 4:22 PM IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కట్టా సింగరకొండ... ఈ నెల 18 న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఒంగోలు జీజీహెచ్​కు తరలించారు. ఈ నెల 22న సింగరకొండను చూసేందుకు బంధువులు ఆస్పత్రికి రాగా... బాధితుడు కనిపించలేదు. ఈ ఘటనపై వైద్య సిబ్బందిని సంప్రదించగా... ఈ నెల 21 నే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సింగరకొండ బంధువులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుర్తు తెలియని మృతదేహంగా...

ఇంతలో జీజీహెచ్​లో గుర్తు తెలియని మృతదేహం ఉందని, శవాగారంలో భద్రపరిచామంటూ ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న మృతదేహం సింగరకొండదేనని గుర్తించిన కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చే వారికి సరైన చికిత్స చేయకపోగా, ఎవరికి చికిత్స చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

ఎస్పీ బాలు మృతి పట్ల ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం

ABOUT THE AUTHOR

...view details