ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను సీపీఐ బృందం పరామర్శిస్తోంది. అద్దంకిలో అప్పుల బాధతో మృతి చెందిన పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబంతో సహా పలు గ్రామాల్లో... వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రకాశం జిల్లాలో సుమారుగా 13 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం మారినా రైతుల అభివృద్ధిలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఆత్మహత్యకు ప్రకటించిన ఏడు లక్షల రూపాయల సాయాన్ని వెంటనే వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేశారు.
అధైర్య పడొద్దు.. ఆత్మహత్యలు వద్దు - ramakrishna
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.
అధైర్య పడొద్దు..ఆత్మ హత్యలకు పాల్పడవద్దు