ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బి.ఎన్. విజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించవద్దంటూ జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలునిరసన చేపట్టారు. సంతనూతలపాడు, నాగులప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి తదితర మండలాల నుంచి మండల, పోలింగ్ కేంద్ర కమిటీల నాయకులు, కార్యకర్తలు ఒంగోలులో ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు.. కాంగ్రెస్ నుంచి వచ్చిన విజయ్‌కుమార్ తెదేపా నాయకులను, కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయడం లేదని... ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.తెలుగుదేశం ముద్దు - విజయ్ కుమార్ వద్దు అని నినాదాలు చేశారు.